Logo
Date of Publish : 07 January 2023, 3:23 pm
Editor : Sake Naresh

యువశక్తి విజయవంతం చేయండి : జనసేన పార్టీ PAC సభ్యులు ముత్తా శశిధర్

        రాజాం ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన నాయకులు ఉర్లాపు పోలరాజు(యు.పి.రాజు) ఆధ్వర్యంలో స్థానిక నియోజకవర్గ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జనసేన పార్టీ PAC సభ్యులు ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న అనేక రకాలుగా నష్టపోయిన యువతకు భరోసాని ఇవ్వడానికే జనవరి 12వ తేదీన యువశక్తి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.సామాన్య యువతీ యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారని యువశక్తి లో మీ గళం వినిపించాలని యువత అందరూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని యువత యొక్క సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. రాజాం నియోజకవర్గం నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) మాట్లాడుతూ జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు పెద్ద ఎత్తున యువత ప్రతి ఒక్కరూ ఈ యువశక్తి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తా శశిధర్ తో పాటు రాష్ట్ర సెక్రటరీ వాసిరెడ్డి శివప్రసాద్ మరియు రాజాం నియోజకవర్గం నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com