రాజంపేట ( జనస్వరం ) : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఉంచాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటి ఆధ్వర్యాన జరిగే రాస్తారోకో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి పట్టణంలో జరిగిన సమావేశంలో సీపీఐ, సీపీయం జనసేన, కాంగ్రెస్ ,రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు పరిరక్షణ కమిటి ఏర్పడి రాస్తారోకో పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతును ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ రాస్తారోకో కు పార్టీలకతీతంగా రాష్ట్రంలో ని లక్షలాది మందికి ఉఫాది నిచ్చే విశాఖ ఉక్కు పరిశ్రమను భాధ్యతగా ప్రతి ఒక్కరూ రాస్తారోకో లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సాంబశివ (సీపీఐ),రామ శ్రీనివాస్(జనసేన), రామాంజులు (సీపీయం),పయాజ్(సీఐటీయూ), చెన్నక్రిష్ణ ( కాంగ్రెస్ కిసాన్ సెల్), పుల్లయ్య ( ఏఐటీయూసి),రంగారెడ్డి (రైతుసంఘం) లు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com