Logo
Date of Publish : 04 January 2023, 4:49 pm
Editor : Sake Naresh

యువశక్తి సభను విజయవంతం చేయండి

- యువశక్తిపై‌ రాయలసీమ జిల్లాలలో ప్రచార రథం ఏర్పాటు
- జనసేనపార్టీ రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ మెంబర్ డాక్టర్ మైఫోర్స్ మహేష్

      చిత్తూరు, (జనస్వరం) : స్వామి వివేకానంద జయంతి రోజైన జనవరి 12న ఆయన నింపిన స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువగళాన్ని వినిపించడానికి జనసేనాని‌ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమం విజయవంతం చేయడానికి రాయలసీమ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో యువత హజరు కావాలని జనసేనపార్టీ రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ మెంబర్ డాక్టర్ మైఫోర్స్ మహేష్ పిలుపునిచ్చారు. ‌బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రణస్థలంలో ఈనెల 12 న నిర్వహించే యువశక్తి సభ కోసం ప్రచారరథం ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ‌ఈ సమావేశంలో జనసేన చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమరనారాయణ, వీర మహిళలు మల్లిక, శోభ, రోజా, జనసైనికులు రమణారెడ్డి, హర్ష, సోను, నాగేంద్ర పాల్గొన్నారు.‌ ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో ఈ నెల 12న జనసేన తరఫున యువశక్తి సభ నిర్వహించేందుకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లు విడుదల చేయడంతోపాటు తన వంతు కృషిగా రాయలసీమ జిల్లాలలో యువశక్తి సభకు విస్తృత ప్రచారం కల్పించడానికి ప్రచారం రథం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రచార రథం సత్యసాయి జిల్లా కదిరిలో ప్రారంభమై సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో యువశక్తి సభపై ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. ‌యువశక్తి సభకు పెద్ద సంఖ్యలో యువత తరలి రావాలని కోరారు. యువత 60 నుండి 70 శాతం వరకు జనసేన వైపు వున్నారని, ఈ సభతో 90 శాతం దాటి యువత మద్దతు ఇస్తారని ఆశించారు. యువత మద్దతుతో రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని దీమా వ్వక్తం చేసారు. ‌ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com