మర్రిపాడు, ఏప్రిల్ 13 (జనస్వరం) : ఈ నెల 15వ తేదీన సోమవారం, సాయంత్రం 4.00 గంటలకు మర్రిపాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి మరియు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజాగళం సభను ఏర్పాటు చెయ్యడం జరిగింది. ముందుగా మర్రిపాడు వెల్కమ్ ఫ్యామిలీ డాబా నుండి ర్యాలీగా వెళ్లి ఏపిలగుంట రోడ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ మంత్రి వర్యలు, ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం.రామనారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి.లక్ష్మయ్య నాయుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, గుటూరు మురళి కన్నబాబు మరియు జనసేన, బీజేపీ పెద్దలు పాల్గొంటున్నారు. కావున ఈ కార్యక్రమనికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాగళం సభను విజయవంతం చేయవలసిందిగా మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి కోరడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com