Logo
Date of Publish : 26 July 2021, 6:07 am
Editor : Sake Naresh

విశాఖ ఉక్కు కై జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఛలో డిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

                    విశాఖ ఉక్కు కై జనసేనపార్టీ జివి ఎమ్ సి 85వ వార్డు ఆధ్వర్యంలో అగనంపూడి శ్రీ శ్రీ శ్రీ బొరమాంబ గుడి వద్ద నుండి జగదాంబ కూడలి, శివాలయం, బి.సి.కాలనీ మీదుగా డొంకాడ వరకు గల 16 ఉక్కు  నిర్వాసిత గ్రామాల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, నిర్వాసితులకు తక్షణ న్యాయం జరగాలని మరియు  ఆగస్టు 2, 3 తేదీల్లో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ  ఆధ్వర్యంలో  జరుగు నిరాహార దీక్షలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ప్రజా చైతన్య పాదయాత్ర తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పి ఎ సి సభ్యులు మరియు గాజువాక నియోజక వర్గం ఇంచార్జ్ శ్రీ కోన తాతారావు గారు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గడసాల అప్పారావు గారు, జివి ఎమ్ సి  64 వ వార్డు కార్పోరేటర్ దల్లి గోవింద రెడ్డి గారు, దుళ్ళ రాము నాయులు, వీర మహిళలు, ఉక్కు ఉద్యోగులు, ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు మరియు ఉక్కు నిర్వాసితులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు వీరమహిళలు, ఉక్కు ఉద్యోగులు, ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు మరియు ఉక్కునిర్వాసితులు పాల్గొన్నారు. 

All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com