
విశాఖ ఉక్కు కై జనసేనపార్టీ జివి ఎమ్ సి 85వ వార్డు ఆధ్వర్యంలో అగనంపూడి శ్రీ శ్రీ శ్రీ బొరమాంబ గుడి వద్ద నుండి జగదాంబ కూడలి, శివాలయం, బి.సి.కాలనీ మీదుగా డొంకాడ వరకు గల 16 ఉక్కు నిర్వాసిత గ్రామాల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, నిర్వాసితులకు తక్షణ న్యాయం జరగాలని మరియు ఆగస్టు 2, 3 తేదీల్లో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగు నిరాహార దీక్షలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ప్రజా చైతన్య పాదయాత్ర తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పి ఎ సి సభ్యులు మరియు గాజువాక నియోజక వర్గం ఇంచార్జ్ శ్రీ కోన తాతారావు గారు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గడసాల అప్పారావు గారు, జివి ఎమ్ సి 64 వ వార్డు కార్పోరేటర్ దల్లి గోవింద రెడ్డి గారు, దుళ్ళ రాము నాయులు, వీర మహిళలు, ఉక్కు ఉద్యోగులు, ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు మరియు ఉక్కు నిర్వాసితులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు వీరమహిళలు, ఉక్కు ఉద్యోగులు, ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు మరియు ఉక్కునిర్వాసితులు పాల్గొన్నారు.