అరకు, (జనస్వరం) : విశాఖ ఉక్కు పోరాటానికి అండగా ఉండాలని ఉక్కు సమితి విజ్ఞప్తి చేయగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 31వ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖపట్నం గాజువాక స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్లి, పరిరక్షణ సమితి ప్రతినిధులను కలిసి, వారు నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొంటారని, జనసేనపార్టీ నాయకులు సాయిబాబా పత్రిక ప్రకటనలు ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 34 మంది ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే, మొట్టమొదటిసారిగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారే అని ఆయన తెలిపారు. 22 మంది వైసీపీ ఎంపీలు ఉండగా వారి వలన ఉపయోగం లేదని తెలిసి, కేవలం పవన్ కళ్యాణ్ గారు వలన విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలమని జనసేన పార్టీ తరఫున గళం వినిపించాలని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి వారి కోరిక మేరకు స్టీల్ ప్లాంట్ ఆవరణలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు విశాఖ మన్యం ప్రాంతపు ఆదివాసి బిడ్డలు, వీర మహిళలు, జనసైనికులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు కదలి రావాలని కలిసి రావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు బాధితులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా సాయిబాబా, దూరియా తెలిపారు.