Logo
Date of Publish : 05 May 2022, 5:45 pm
Editor : Sake Naresh

జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ను జయప్రదం చేయండి : జనసేన నాయకులు

                  కర్నూలు ( జనస్వరం ) : జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా నిలబడి చేస్తున్న జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర మే 8 న కర్నూలు జిల్లా శిరివెళ్ళ గ్రామంలో జరిగే రచ్చబండకు జిల్లా నలుమూలల జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. ఎమ్మిగనూరు జనసేనపార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరు ఇంచార్జి శ్రీమతి రేఖగౌడ్ ఆదేశాల మేరకు జనసేనపార్టీ కార్యాలయం దగ్గర పిడికిలి టీమ్ పోస్టర్లను జనసేన నాయకులు గానిగ బాషా, రవి ప్రకాష్, యలప్ప, మబాషా,విడుదల చేశారు. అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు చేసిన అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నా రైతు కుటుంబాలను ధైర్యం చెప్పి అండగ నిలబడటంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర ద్వారా కుటుంబాలకు మనోధైర్యాన్ని నింపి అండగా వుంటామని భరోసా కల్పిస్తుంటే వైసిపి నాయకులకు జనసేన మంచి చేయడం మింగుడు పడటం లేదని అందుకే మంత్రులతో దాడులు చేయిస్తున్నారని తెలిపారు. దాదాపు రాష్ట్రంలో మృత్తి చెందిన 3 వేల మంది కౌలు రైతులకు 30 కోట్ల మేరకు సహాయం అందించడానికి జనసేనపార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న మంత్రులు పని కట్టుకొని బూతులు వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రైతులకు భరోసా కల్పించడం కోసం కర్నూలు జిల్లాలో మే 8 వ తేదీ నిర్వహించే శిరివెళ్ల రచ్చబండకు జనసేన కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com