Logo
Date of Publish : 17 February 2022, 4:32 pm
Editor : Sake Naresh

మత్స్యకార అభ్యున్నతి సభను విజయవంతం చేయండి : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

● 20న ఛలో నరసాపురం విజయవంతం చేయాలని పిలుపు.
● 18న విజయనగరం జిల్లాలో మత్స్యకారుల ప్రాంతాల్లో పాదయాత్ర.
● జనసేన మత్స్యకార వికాస విభాగంలో నియమింపబడిన కార్యవర్గ సభ్యులకు సన్మానం.

       విజయనగరం, (జనస్వరం) : రాష్ట్రంలో మత్స్యకారులను వైస్సార్సీపీ ప్రభుత్వం గాలికి వదిలేసి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తుందని వైస్సార్సీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మండిపడ్డారు. గురువారం ఉదయం పార్టీకార్యాలయంలో జనసేన మత్స్యకార వికాస విభాగంలో కార్యదర్శలుగా నియమితులైన గనగల్ల రాజు, కర్రీ అప్పలరాజును ఆమె సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 20వ తేదీన నరసాపురం లో వారికి మద్దతుగా భారీసభను పెడుతున్నారని, ఇప్పటికే ప్రభుత్వం మత్స్యకారులకు బడ్జెట్ కేటాయింపుల్లో గాని,ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు ఇస్తామన్న పదిలక్షల రూపాయలు ఇవ్వట్లేదని, చేపల వేటకు అధునాతన మైన బోట్లు, కనీసం వలలు గాని అందివ్వడంలేదని, కనీసం చదువుకున్న మత్స్యకారుల యువతీయువకులకు ఉపాధి కల్పనగాని, రుణాలను గాని సమకూర్చట్లేదని ప్రభుత్వంపై దుయ్యబట్టారు. ఈనెల20వ తేదీన మత్స్యకారులు పడుతున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తెలిపేందుకు పవన్ కళ్యాణ్ గళమెత్తనున్నారు. ఆ సభకు భారీఎత్తున మత్స్యకారులు, ప్రజలు, జనసైనుకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ అభ్యున్నతి సభకు మద్దతు గా 18వ తేది, నేడు శుక్రవారం విజయనగరంలోను, సముద్రతీరప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు ఉండేప్రాంతాల్లో మత్స్యకార వికాస విభాగం నాయకులతో పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే మత్స్యకార వికాస విభాగం కార్యవర్గ సభ్యులుగా నియమితులైన గనగల్ల రాజు,కర్రీ అప్పలరాజు లకు మత్స్యకారుల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి కృషిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఝాన్సీ వీరమహిళ తుమ్మి లక్ష్మీ రాజ్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), లాలిశెట్టి రవితేజ, జనసేన కార్పొరేటర్ అభ్యర్థి దాసరి యోగేష్, మిడతాన రవికుమార్, మైలపల్లి ఎల్లాజి, సాయి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com