విజయవాడ ( జనస్వరం ) : వంగవీటి మోహన్ రంగా గారి పేరుని అడ్డుపెట్టుకొని రాజకీయంగా ఎదిగింది తమరే కదండీ.తమరు 2019 నుంచి కాపు రిజర్వేషన్ ఉద్యమానికి శాశ్వత ముగింపు ఎందుకిచ్చారండి. తమరు కాపు రిజర్వేషన్ ఉద్యమం చేసింది కాపుల అభివృద్ధి సంక్షేమం కోసం కాదని కేవలం వైఎస్సార్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తెచ్చేందుకు రాష్ట్రంలో అన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకే కదండి. తుని రైలు దగ్ధం ఘటన తమరికి ముందే తెలుసు కదండీ? కానీ అమాయకులైన కాపు యువతను ప్రలోభ పెట్టి రెచ్చగొట్టి వారి జీవితాలను బలి చేశారు కదండీ. పిఠాపురంలో తమరు పోటీ చేయాలని వైసిపితో ముందే ఒప్పందం కుదుర్చుకున్నారు కదండీ. మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి రెండు రోజులు పర్యటన పిఠాపురంలో విజయవంతమై లక్షల మంది బహిరంగ సభకి హాజరై విజయవంతం చేయంగానే తమరి ఓటమి ఖరారు అయిపోయిందని మీ ఆశలు అడియాశలు అయ్యాయనే అక్కసుతోనే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై విషం చిమ్ముతూ లేఖలు రాస్తున్నారు. వంగవీటి మోహన రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారిపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వంలో వారిని చంపేందుకు రెక్కీ నిర్వహిస్తే తమరు కనీసం స్పందించలేదు ఒక్క లేఖ కూడా రాయలేదు కదండీ. వంగవీటి మోహన రంగా గారిని హత్య చేయించిన వారి కుటుంబాలతో తమరు ఆనందంగా మాట్లాడుతారు ఆప్యాయతతో వడ్డిస్తారు. ఇవన్నీ నిజమే కదా అండి. అపార్ట్మెంట్ కొనిపించడంలో తమకు సహకరించిన ఇద్దరు వేరే పార్టీ నాయకుల పేర్లు కూడా తమరు బయటకు చెప్పాలండి.