Logo
Date of Publish : 26 October 2022, 5:13 pm
Editor : Sake Naresh

పోలీసుల నిఘా మధ్యలో పోతిన మహేష్..!

- వారం, పది రోజులుగా మఫ్టీలో మహేష్ చుట్టూనే ఎందుకు..?
- పోతిన మహేష్ ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్తున్న వెంట వెళ్తున్న పోలీసులు
- కుటుంబంతో షాపింగ్ వెళ్లిన ఫాలో అయిన పోలీసులు
- ఎవరి ఆదేశాలనుసారం పోలీసులు ఈ విధానాన్ని పాటిస్తున్నారు.
- పశ్చిమలో జనసేన గెలుపుపై వణుకు మొదలైందా..?
- ఈ దుశ్చర్య దేనికి సంకేతం..?
        విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ ముఖ్య నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్ నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారాల కోసం పాటుపడుతున్న జన నాయకులు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో పోతిన మహేష్ పై వారం, పది రోజులుగా పోలీసులు నిఘా పెట్టడం.. ఆయన ఎక్కడికీ వెళ్తున్నారు.. ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారు.. అనే విషయాలపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీపావళి పండుగ నాడు పోతిన మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ కి వెళ్లగా అక్కడికి కూడా పోలీసులు వెన్నంటే వెళ్లారు. పోలీసుల చర్యకు ఎవరి ఆదేశాలు ఉన్నాయనేది తెలియాల్సిన విషయం. విజయవాడ పశ్చిమనా జనసేన గెలుపు తథ్యమని తెలిసి ఎవరి వెన్నులో వణుకు మొదలైందో మరి..?. ఇంత జరుగుతున్న అన్నిటిని ఓర్పుగా, సహనంతో అధిగమిస్తూ.. చెరగని చిరునవ్వుతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఏది ఏమైనా 2024లో బెజవాడ పశ్చిమంలో జనసేన గెలుపును ఎవరు అడ్డుకోలేరనే భావనలో ప్రజలు ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com