Logo
Date of Publish : 11 April 2022, 4:02 pm
Editor : Sake Naresh

వల్లూరు గ్రామ జనసేనపార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

     వల్లూరు, (జనస్వరం) : ఆచంట నియోజకవర్గం, వల్లూరు గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలె గారి జయంతి సందర్బంగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళ్ళర్పించి, వైసీపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల కు చేస్తున్న అన్యాయంపై ఒంటి కాళ్లపై నిలబడి నిరసన తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలు ఐనటువంటి SC, ST, BC ల నిరుద్యోగ యువతకు అందాల్సిన సబ్సిడీ లోన్స్ విడుదల చేయకుండా జాప్యం చేస్తూ కాలయాపన చేస్తూ యువతకు అన్యాయం చేస్తుందని, గత టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్లు పాటు సబ్సిడీ లోన్స్ ఇవ్వకుండా మోసం చేస్తే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు అందాల్సిన నిధులను వైసీపీ పార్టీ కార్యకర్తలును కార్పొరేషన్ చైర్మన్ లను, డైరెక్టర్లను చేసి వారికీ జీతాల రూపంలో దోచిపెడుతున్నారని, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల పేదలకు ఒరిగింది ఏమిలేదని, కేవలం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వైసీపీ కార్యకర్తలుకు పదవులిస్తే సరిపోదని కార్పొరేషన్ కి నిధులు విడుదల చెయ్యాలని, కానీ వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తూ యువతకు అన్యాయం చేస్తేస్తున్నారని, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి బడుగు, బలహీన వర్గాల యువతకు అందాల్సిన సబ్సిడీ లోన్స్ వెంటనే విడుదల చెయ్యాలి అని డిమాండ్ చేసారు. జనసేనపార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అందాల్సిన సబ్సిడీ లోన్స్ విడుదల చేయకుండా యువతకు అన్యాయం చేస్తున్నారని, ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి మోసం చేసారని, కనీసం సబ్సిడీ లోన్స్ వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి ఏర్పడుతుందని, కనీసం ఇప్పుడైనా సబ్సిడీ లోన్స్ విడుదల చేసి బడుగు, బలహీన వర్గాల యువతకు న్యాయం చెయ్యాలి అని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు యేడిద బాలు, కడిమి ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com