కదిరి ( జనస్వరం ) : వెనుకబడిన బడుగు బలహీనర్గాల హక్కుల కోసం,మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త,సమాజంలో కులవివక్షత,అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు, అభ్యుదయవాది శ్రీ మహాత్మా జ్యోతి రావు పూలే గారి జయంతి సందర్భంగా కదిరి జనసేన పార్టీ ఇంచార్జీ P.C భైరవ ప్రసాద్ గారు మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా పార్టీ శ్రేణులతో కలిసి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా భైరవ ప్రసాద్ గారు మాట్లాడుతూ జన సేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహాత్మా జ్యోతి రావు పూలే గారి ఆశయాలతో 2014 లో పార్టీని స్థాపించి పేద,బడుగు బలహీవర్గాలకు రాజ్యాధికార ఫలాలు అందించాలని వారికి మరింత తోడ్పాటు అందిస్తే రాజకీయ మార్పును సాధించవచ్చని నమ్మిన ఏకైక నాయకుడు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అంతే కాకుండా మహిళలు సైతం రాజకీయ రంగాల్లో రానించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే చట్టసభల్లో 33% శాతం రిజర్వేషన్ కల్పించాలని తన మనిఫెస్తోలో పొందుపరిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని రాబోయే రోజుల్లో కులాల ఐక్యతతో బడుగు బలహీనర్గాల అభ్యున్నతికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కాయల చలపతి గారు, ఐటి వింగ్ కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్ గారు,జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల,సీనియర్ నాయకులు వానిళ్లి అంజిబాబు, గోపీనాథ్, హరిబాబు, రెడ్డి వంశీ, ప్రతాప్, నరసింహులు, కృష్ణకాంత్, చక్రి, బాబుల్లి, భరత్, పెద్ది రెడ్డి, నగేష్ తదితర జన సైనికులు పాల్గొని జ్యోతి రావు పూలే విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.