
రాజంపేట ( జనస్వరం ) : నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలిలో జాతిపిత మహాత్మాగాంధీ గారి 75వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పలువురు నేతలతో కలిసి ఘనంగా నివాళులు అర్పించిన జనసేనపార్టీ జనసేన నాయకులు. రామ శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యాగ్రహం అనే ఆయుధంతో అహింసా మార్గంలో నడిపించిన మహాత్ముడు మనము స్వాతంత్ర భారత దేశంలో స్వేచ్ఛగా ఉన్నామంటే ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగలతోనే అని నేటి తరం గుర్తించుకోవాలి. వారి స్పూర్తితో అందరూ చైతన్యవంతులవ్వి మన సమాజాన్ని భవిష్యత్తులో బాధ్యతగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉందని రాబోయే భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా భారతదేశ ప్రజల బానిసత్వాన్ని రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన “మహాత్మా గాంధీ” గారి 75వ వర్ధంతి కార్యక్రమంలో జనసైనికులు, వివిధ సంఘాల నాయకులు, రైతులు, చెన్నంశెట్టి రామంజులు, తోట రవీంద్ర, సుబ్బరాజు, వెంకటయ్య, కృష్ణారెడ్డి, జగిలి రమణ, భాష, యువకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.