మానవత్వాన్ని చాటిన మాడుగుల జనసైనికులు.
విశాఖపట్నం ( జనస్వరం) : విధినిర్వహణలో ప్రమాదానికి గురై మంచానికి పరిమితం అయిన లైన్ మెన్ కు ఆర్థిక సహాయం అందించి జనసైనికులు మానవత్వం చాటుకున్నారు. మాడుగుల మండలం సత్యవరం గ్రామానికి చెందిన లైన్ మెన్ రమేశ్ ఇటీవల ప్రమాదానికి గురవడం వలన వెన్నెముక విరగడంతో మంచానికే పరిమితం అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మాడుగుల నియోజకవర్గ జనసైనికులు రూ.21 వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటుగా ఒక నెలకు సరిపడా వంట సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని మాడుగుల జనసేన కార్యకర్తలు భరోసా ఇచ్చారు. రమేశ్ విషయాన్ని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. మాడుగుల నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా మా వంతు సహాయం ఉంటుందని జనసేన నాయకులు భరోసా ఇచ్చారు.ఈ లాక్ డౌన్ సమయంలో కూడా మేమంతా కలసి కట్టుగా మా వంతు సహాయం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ మరియు జె యస్ ఎం రాష్ట్ర పరిపాలన కార్యదర్శి బొయిదాపు కిరణ్, గుమ్మడి శ్రీరామ్, జీ.వి మూర్తి, రౌతు ప్రసాద్, రాము, శ్రీనాథ్, విజయ్, గట్టా రామారావు మరియు మాడుగుల జనసైకులు పాల్గొన్నారు.