Logo
Date of Publish : 05 August 2021, 5:34 am
Editor : Sake Naresh

జనసేనపార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న మాడుగుల జనసైనికులు

        మాడుగుల నియోజకవర్గ పరిధిలో చీడికాడ గ్రామంలోని శివాలయం దగ్గర జనసైనికులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం, జనసేన పార్టీ సిద్దాంతాలను, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా ఎలా తీసుకెళ్లాలి అనే విషయాలపై చర్చించారు. ఈ సమావేశ కార్యక్రమంలో ప్రస్తావించిన కొన్ని ముఖ్య విషయాలు.

1) జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు గురించి.  మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కోటపాడు నాలుగు మండలాలకు అందుబాటులో ఉంటుందని చీడికాడ గ్రామంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడమైనదని వివరించారు. ఆగష్టు 12 వ తారీఖున చీడికాడ MRO ఆఫీసు దగ్గరలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి నిశ్చయించుకున్నారు. 

2) కళ్యాణ్ గారి ఆశయాలు ,సిద్ధాంతాలు నచ్చి పార్టీలో పనిచేస్తున్నామని, మనమంతా ఎటువంటి మనస్పర్ధలు పడకుండా, రాగద్వేషాలు లేకుండా, ఐకమత్యంతో ఒక కుటుంబంలా అన్నదమ్ములవలె కలిసుండాలని, నిస్వార్ధంగా పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని చర్చించారు.

3)  పార్టీకి సంబంధించినవి, మన గ్రామాలలో ఉన్న సమస్యల గురించి గ్రూపుల్లో వివరించమని చర్చించడం జరిగింది.

4) ఈనెల అనగా ఆగస్టు 12 వ తారీఖున చీడికాడ లో మన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం. కనుక మన జనసైనికులు అందరూ హాజరవ్వాలని, ఎవరైతే అటు టిడిపి కానీ ఇటు వైసిపి పార్టీలకుకానీ దూరంగా ఉంటూ మధ్యస్థంగా ఉన్నవారిని మన పార్టీ సిద్ధాంతాలను విపులంగా వివరించి వారిని మన పార్టీ లోనికి ఆహ్వానించాలని చర్చించడమైనది.

5) ఇంతవరకు మన నియోజకవర్గంలో చేరికలు జరగలేదు. ఇంతకంటే చేరికలను ఆహ్వానించడానికి మంచి సమయం ఉండదని, ఈ సందర్భంగా చేరికలను ఆహ్వానిస్తే బావుంటుందని చర్చించడమైనది.

6) ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సమన్వయ పరచడానికి ప్రతి మండలానికి నలుగురు నుంచి ఎనిమిది మందిని నియమించడం జరిగింది. 

7) ఇప్పటికే చాలా గ్రామాల నుంచి వస్తు సహాయం, ధన సహాయం ఇస్తామని స్వయంగా ప్రకటించారు. వాటిని పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com