మాడుగుల ( జనస్వరం ) : మాడుగుల గ్రామానికి చెందిన జనసైనికుడు ఉన్నింగుల గుణ సాయిపై మాడుగుల స్థానిక వైఎస్ఆర్సిపి ఎంపీపీ రామ ధర్మజ మరియు ఆయన కుమారుడు చేసిన దాడిని మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని రాయపురెడ్డి కృష్ణ గారి తెలియజేశారు. ఈనెల 5వ తారీఖు నుంచి సాయికి సంబంధం లేని గొడవలు స్థాయిపై చేయి చేసుకొని మానసికంగా ఇబ్బందులు పెడుతూ ఇప్పటిదాకా కూడా ప్రతిరోజు స్టేషన్లు చుట్టూ పోలీసులు కను సైగలో ఇదంతా జరిగిందని ఎవరికి చెప్పిన సరే నా వెనక మినిస్టర్ ఉన్నారు .. పోలీసులు కూడా నేను చెప్పింది చేస్తారని సాయికి మానసికంగా ఎంతో ఇబ్బంది పెడుతూ బెదిరిస్తున్నారు. ఏదైనా చేస్తానని దౌర్జన్యం చేసి ఇబ్బంది పెట్టిన కారణంగా ఈరోజు జనసైనికుడు సాయి మనస్థాపానికి గురై విషం తాగడం జరిగింది. ఒకవేళ సాయికి గనక ఏదైనా సరే జరగకూడని జరిగితే దానికి బాధ్యుడు స్థానిక ఎంపీపీ మరియు మాడుగుల పోలీసులేనని ఈ యొక్క పత్రికలందరికీ కూడా నేను తెలియజేస్తున్నానని అన్నారు. ఇదే విషయాన్ని మా రాష్ట్ర పెద్దల వరకు కూడా నేను తీసుకోవడం జరిగింది. దీనిపైనే అధికారికంగా పైనుంచి కూడా ప్రకటన రానుంది రేపు మాడుగుల హెడ్ క్వార్టర్లో మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క స్థాయికి జరిగిన అన్యాయం పట్ల జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమం కూడా మేము చేయదలచుకున్నాం. 24 గంటల్లోపు వైఎస్ఆర్సిపి ఎంపీపీ నుంచి గాని లేదా పోలీసు వ్యవస్థ నుంచి గాని దీనికి గాక సరైన సమాధానం రాని యెడల పవన్ కళ్యాణ్ గారి వద్దకు ఈ యొక్క సమస్యను తీసుకెళ్లి నేరుగా సాయి చేతనే ఏం జరిగిందనేది పవన్ కళ్యాణ్ గారికి వినిపిస్తామన్నారు మేము పార్టీ పెద్దలు చెప్పిన విధంగా చేస్తామని మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా మాడుగుల నియోజకవర్గంలో జనసైనికులు మీద పలు కేసులు పెట్టి ఎన్నో రకాల ఇబ్బందులు గురిచేస్తున్న స్థానిక ఎంపీపీ కానీ ఉపముఖ్యమంత్రి మూడు ముత్యం రెడ్డి గారు గాని మరొక మూడు నెలలు అవదులోనే వీళ్ళందరికీ కూడా తగిన శాస్తి జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నానని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com