ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖ్యంగా మాట్లాడుతూ నిన్నటి రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో సమావేశమై ఓటరు జాబితాలో వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న అక్రమాలపై తెలియజేయడంతో దానిపై వైసీపీ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడే లేని పార్టీ మీ వైఎస్ఆర్సిపి పార్టీ అని విజయసాయిరెడ్డి వయసుతోపాటు బుద్ధి కూడా పెంచుకోవాలని నువ్వు సీబీఐ కేసుల్లో ముద్దాయివి, సూట్ కేసు కంపెనీల కేసుల్లో ఉన్న దొంగవి నువ్వు, నీకు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని విమర్శించే అంతస్థాయి కాదని ఎలక్షన్ కమిషన్ కు నీ లాంటి దొంగ సూచనలు అవసరం లేదని మండిపడ్డారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com