Logo
Date of Publish : 19 December 2023, 11:19 pm
Editor : Sake Naresh

గ్రామాల్లో పర్యటిస్తున్న మధుసూదన్ రెడ్డి

   ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలోని రామాపురం, కునుకుంట్ల, మద్దలచేరువు, బీమారాయుని పేట, పిన్నదరి, ఏకమాదం పల్లి, పుల్లనారాయణ పల్లి గ్రామాలలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి  పర్యటించడం జరిగింది. జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ప్రజలు, మహిళలు తండోపతండాలుగా విచ్చేసి హారతులు, పూలదండలు, డబ్బులు, వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.  అనంతరం గ్రామాలలో పర్యటిస్తూ గ్రామ సమస్యలపై తెలుసుకుంటున్న క్రమంలో వీధిలో కరెంట్ పోల్స్ లేకపోవడం వల్ల వీధి లైట్లు ఎక్కడా లేవని రాత్రిపూట వెలుతురు లేకుండ చాలా ఇబ్బంది అవుతుందని అలాగే గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్సలు బాగోలేదని వాపోయారు. తప్పకుండా జనసేన - తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వారి సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చి ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పనులను ప్రజలకు వివరించి ధర్మవరంలో వైసీపీని గద్దె దించి జనసేన,తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా కోరారు.  ఈ కార్యక్రమంలో తాడిమర్రి మండల కన్వీనర్ చంద్రబాబు నాయుడు, ధర్మవరం రూరల్ కన్వీనర్ నాగ సుధాకర్ రెడ్డి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయరామాంజనేయులు, కోటికి రామాంజి, టీడీపీ నాయకులు యెర్రమల మోహన్ గౌడ్, శ్రీధర్, నరసయ్య, శ్రీనివాస్ రెడ్డి, తాడిమర్రి నాయకులు మండల ఉపాధ్యక్షులు ఆది, రంగారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి ఇంద్ర, మన్నల మల్లికార్జున, కార్యదర్శులు రామచంద్ర, రంగనాయకులు, గోపాల్, రాజు దామోదర్ మరియు, తలారి ప్రతాప్, ప్యాదింది వెంకటేష్, అన్వర్, సాకే నరసింహులు, శివ శంకర్ రెడ్డి,మితిగొల్ల వెంకటరాముడు, కాశప్ప, ధారా గంగాధర్, గొంగటి హరి, బాషా, తిమ్మారెడ్డి గారి బాబు రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com