ధర్మవరం ( జనస్వరం ) : జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ చంద్రబాబును జైలుకు పంపిన పవన్ కళ్యాణ్ ను తిట్టిన ఏం చేసినా మీరు ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలవలేరని ఆక్రోశించారు. ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని జోస్యం చెప్పారు. అలాగే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎన్నిసార్లు చెప్పినా పల్లకీలు మోసే చరిత్ర నీ కుటుంబానిదని అనంతపురం ప్రజలందరికీ నీ కుటుంబ చరిత్ర గురించి తెలుసని అన్నారు. పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించడానికి వచ్చిన నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.