ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం పట్టణంలోని నూతన జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ధర్మవరం పట్టణం మరియు ధర్మవరం రూరల్ బూత్ కమిటీ సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఓటర్ లిస్ట్ లను బూత్ కమిటీ సభ్యులకు అందజేసి వారి వార్డులలో ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ అయితే దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉన్నాయో వాటిని గుర్తించి తొలగించే దిశగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్దామని తెలియజేయడం జరిగింది .అలాగే ధర్మవరం మండల కమిటీ సభ్యులను నియమించడం జరిగింది. ఈ కమిటీలో నియమితులైన వారు మండల కమిటీ అధ్యక్షులుగా డి.నాగ సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా గిరక చిరంజీవి, బి.శివ శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా జి.చిరంజీవి, ఏ.జయరాం రెడ్డి, జి.శైలజ, రాజశేఖర్ రాజు, కార్యదర్శులుగా యమ్.సుధాకర్ బి.పెద్దన్న యస్.షేక్షావలి,జి.రవి,గోవిందరెడ్డి,టీ.బాబు రెడ్డి, చిలకం సుధాకర్ రెడ్డి, యమ్.సుబ్బన్న, యస్.మౌలాలి సంయుక్త కార్యదర్శులుగా రమేష్, పి.రాజశేఖర్ రెడ్డి, పడగాల రాజశేఖర్, వి.నాగార్జున, అంగజాల వంశీ, సిసి.రాము, కే.కృష్ణమూర్తి, ఏ.ప్రతాప్ గార్లకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు,పట్టణ నాయకులు అడ్డగిరి శ్యామ్ కుమార్, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు కోటికి రామాంజి, పేరూరు శ్రీనివాసులు, దాడి తోట కృష్ణయ్య, టి.ప్రతాప్, బాలకృష్ణ, దాము, కోలా నాగార్జున, రాజప్రకాష్, నీలురు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com