( జనస్వరం ) : జనసేన పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షురాలిగా మద్దూరి నాగలక్ష్మిని పార్టీ అధిష్టానం నియమించటం జరిగింది. ఈ సంధర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ తనపై నమ్మకంతో హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగం, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి, నియోజకవర్గ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పచెప్పినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం అంకితభావంతో పనిచేస్తానని, హఫీజ్ పేట్ డివిజన్ లోని ప్రతి ఓటర్ వద్దకు, యువతకు జనసేన పార్టీని చేరుస్తానని అన్నారు. హఫీజ్ పేట్ లో జనసేన పార్టీని బలోపేతం చేసేవిధంగా కార్యకర్తలను నిర్మాణం చేస్తానని, ప్రజలతో మమేకమై, సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ, ప్రభుత్వం మరియు యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలను పరిష్కరించి, ప్రజలకు జనసేన పార్టీ పై నమ్మకం కలిగేలా కృషి చేస్తానని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com