Search
Close this search box.
Search
Close this search box.

మద్దాలి గిరి , ముస్తఫా తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలి : గుంటూరు అర్బన్ జనసేన పార్టీ డిమాండ్

గుంటూరు

            గుంటూరు ( జనస్వరం ) :  గంజాయి మత్తులో మైనర్ యువకులు చేసిన హత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ గుంటూరు పశ్చిమ , తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలి గిరి , మహమ్మద్ ముస్తఫా వెంటనే తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి డిమాండ్ చేశారు. మద్యం, గంజాయి మత్తులో దొంగలు చేసిన హత్యలకు , దాడులకు నిరసనగా జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ఆదేశాల మేరకు గురువారం హిమని సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ రాక్షస పాలన – మాకొద్దు, ఈ అరాచక పాలన – మాకొద్దు, ఈ అసమర్ధ పాలన – మాకొద్దు గంజాయి రహిత ఆంద్రప్రదేశ్ కావాలంటే- ఈ జగణాసురుని పాలన పోవాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన బటన్ నొక్కటానికే పరిమతమైందని విమర్శించారు. రాత్రి పది దాటితే ప్రజలు బయట తిరగాలి అంటేనే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి , హెరాయిన్ వంటి మాదకద్రవ్యాల వ్యాపారంలో కొందరు వైసీపీ నేతలే భాగస్వామ్యులుగా ఉండటం హేయమన్నారు. వక్కపొడి దొరికినంత సులువుగా గంజాయి పొట్లాలు దొరుకుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. నగర శివారు ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటున్నాయని పోలీసులు ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలో వైసీపీ నేతల మితిమీరిన జోక్యం సరికాదని నగర ఉపాధ్యక్షులు కొండూరి కిషోర్ , చింతా రాజు అన్నారు. ఇప్పటికైనా గంజాయి ,హెరాయిన్ వంటి మాదకద్రవ్యాల పై పోలీసులు ఉక్కుపాదం మోపాలని కోరారు. పరిపాలన చేతకాని ఒక అసమర్ధుని పాలనలో రాష్ట్రం అతలాకుతలం అవుతుందని నగర ప్రధాన కార్యదర్శిలు యడ్ల నాగమల్లేశ్వరరావు , ఆనంద్ సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందచేయాలని వారు డిమాండ్ చేశారు. తొలుత వీర మహిళలు మల్లీశ్వరి, కవిత, ఆషా, అరుణలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు , డివిజన్ కమిటీ అధ్యక్షులు , జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way