
మదనపల్లి ( జనస్వరం ) : సిటియం పంచాయతీ దిగువ కాశీరావు పేట, ఎగువ కాశీరావు పేటలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం జరిగింది. మహిళలు, యువకులు, వృద్ధులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి 30 మంది జనసేన పార్టీలో చేరారు. వీరందరినీ శ్రీ రామ రామాంజనేయులు గారు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లె జనసేన నాయకులు, చంద్రశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, రామిశెట్టి నాగరాజు తొక్కోల శివ, శంకర గంగాధర చిన్న రెడ్డి, నాగరాజు, శ్రవణ్, రంగనాథ, ఎల్లప్ప, సుధాకర్ రమేష్, శ్రీనివాసులు, ఈశ్వరయ్య, మదనపల్లి మహిళా నాయకురాలు చామంతుల మల్లికా తదితరులు పాల్గొన్నారు.