మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లె జనసేన నాయకులు రామాంజనేయలు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరిన యువత. మదనపల్లె టౌన్, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాల నుండి భారీ సంఖ్యలో యువత సోను, అరవింద్, మణి, శివ, చక్రి, రేవణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో 50 మంది యువత చేరారు.. వీరందరికీ మదనపల్లె జనసేన నాయకులు రామాంజనేయలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ దేశ, రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి వైపు నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాలకు యువత సహకరించాలని, 2024 ఎన్నికల్లో పోటీ చేసే ఉమ్మడి అభ్యర్థులకు అండగా వుండాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు రూపా, కుప్పాలశంకర, గంగాధర్, వినయ్, రంగనాధ్, యాసిన్, శేఖర్, ధరణి, సోను, అరవింద్, చక్రి, మణి, శివ, రేవణ్, వేణు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com