మదనపల్లి ( జనస్వరం ) : స్థానిక మిషన్ కాంపౌండ్ పక్కన మాతా శిశు సంక్షేమ భవనం వద్ద గత 10 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ నిరవదిక సమ్మె చేస్తున్నారు. 500 మంది మదనపల్లి, రామ సముద్రం, నిమ్మనపల్లి అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ మరియు హెల్పర్స్ కు మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత అధ్యక్షతన మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. తదుపరి అంగన్వాడీలతో కలిసి జనసేన నాయకులు సహపంక్తి భోజనం చేస్తూ అంగన్వాడీల సాధకబాధకాలు తెలుసుకోవడమైనది. ఈ కార్యక్రమంలో మహిళ శోభ, మదనపల్లి జనసేన నాయకులు కుప్పాల శంకర, పాల్గున, ధరణి రాయల్, కిరణ్ కుమార్ రెడ్డి,అశ్వత్, గంగాధర, గణేశ్, మైనారిటీ నాయకులుషేక్ యాసీన్ విద్యార్థివిభాగంఅధ్యక్షుడు సుప్రీం హర్ష,ఉపాధ్యక్షుడు జనసేన సోను బహదూర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు తదుపరి అంగన్వాడీలతో కలిసి ర్యాలీకి మద్దతిచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com