
మదనపల్లె, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాలలో భాగంగా చిత్తూరు జిల్లాలో మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గమును జిల్లాగా ప్రకటించాలని మదనపల్లి JAC సమావేశం మదనపల్లి బిటి కళాశాలలో శ్రీ రవీంద్రనాథ్ టాగూర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించడమైనది. ఈ కార్యక్రమానికి జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత గారు జనసేన తరపున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని జనసేనపార్టీ తరుపున కోరుతున్నామని తెలియజేశారు.