
మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కరోనాతో బాధపడుతున్న ప్రజలకు ఉచితంగా ఆహార పంపిణీ కార్యక్రమాన్ని మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయం నుండి ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ, అధికార పార్టీ ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. కరోనాతో పనులు లేక పస్తులు ఉంటున్న విషయం తెలుసుకున్న జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గంలో కరోన బాధితులకు ఉచితంగా ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలియజేశారు. మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లో కరోన బాధితులు వారి యొక్క ఆధార్ కార్డును, మరియు కరోనా రిపోర్ట్ గాని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ గాని ఆధారంతో ముందు రోజు జిల్లా కోర్ట్ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో వారి పేర్లు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. అర్హులైన కరోనా బాధితులకు కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్ల లో ఉచితంగా జనసైనికులు ఇంటికి వచ్చి ఉచితంగా ఆహార పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. మచిలీపట్నం నియోజకవర్గం 34 గ్రామాలకు సంబంధించి కరోనా బాధితులు వారి పేర్లు నమోదు చేసుకుని వారి తరపున వచ్చి జనసేన పార్టీ కార్యాలయంలో లో స్వయంగా వారి కుటుంబ సభ్యులు గాని స్నేహితులు గాని వచ్చి ఫుడ్ ప్యాకెట్ తీసుకెళ్లే సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.