మచిలీపట్నం, (జనస్వరం) : ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ మచిలీపట్నం జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం ఇంఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన తెలియజేసి అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన కష్ట కాలంలో సామాన్యులకు కరెంట్ బిల్ కట్టటం కష్టంగా ఉన్న కాలంలో నాలుగు సంవత్సరాలు ముందు వాడిన కరెంట్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రతీ యూనిట్ పై ఒక రూపాయి ఇరవై మూడు పైసలు అదనంగా వసూలు చేయడం అమానుషమని ఆయన తెలిపారు. ఈ రెండున్నర సంవత్సరాల జగన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అని అదీ చాలదు అన్నట్లు ఫిక్సడ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు విద్యుత్ సుంకంతో పాటు ఇప్పుడు కొత్తగా ఈ ట్రూ అప్ ఛార్జీల పేరుతో భారం అంతా సామాన్యులపై వేయటం సరైన నిర్ణయం కాదని తెలిపారు. నష్టాల్లో ఉన్న కరెంట్ బోర్డును సవరించాలంటే ప్రభుత్వం నుంచి రావాలిసిన బకాయిలు పెడితే సరిపోతుంది అని, సామాన్యులపై ఈ భారం మోపడం సరైన నిర్ణయం కాదని, త్వరితగతిన ఈ ఛార్జీలను నియంత్రించవలసినదిగా జనసేన పార్టీ తరుపున మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరుపున కోరుచున్నాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, నాలుగోవ డివిజన్ కార్పొరేటర్ ఛాయాదేవి గారు, జిల్లా ఉపాధ్యక్షులు ఒంపుగడవల చౌదరి గారు, మండల అధ్యక్షుడు గల్లా తిమోతి, బొమ్మసాని నరేష్ వివిధ డివిజన్లో ఇంఛార్జ్ లు ఎండి సమీర్, వడ్డీ చిరంజీవి, లంక శ్రీనివాస్, కర్రి మహేష్ జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.