Logo
Date of Publish : 01 June 2026, 5:56 pm
Editor : Sake Naresh

మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎం. విజయ్ కృష్ణ బాధ్యతల స్వీకరణ

అనంతపురం  జూన్ 1 జనస్వరం - జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఎం.విజయ్ కృష్ణ ఎంఎఫ్ఎస్సి, సోమవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో విజయనగరం జిల్లాలో మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన, డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రమోషన్ పొంది అనంతపురం జిల్లాకు నియమితులయ్యారు. మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ ఎం. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, జిల్లాలో మత్స్యరంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరవేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. చేపల ఉత్పత్తి పెంపుతో పాటు ఆధునిక మత్స్య సాగు విధానాలపై అవగాహన కల్పించి మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.అధికారులు, సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తామని, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని.జిల్లా మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, సూపరింటెండెంట్ డి. నాగరాజు, ఫిషరీస్ డెవలప్‌మెంట్ అధికారులు హెచ్.ఎస్. ఆసిఫ్, ఎస్.ఎన్. లక్ష్మీనారాయణ, డి. పెద్దబాబు నాయక్‌తో పాటు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

 

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com