కళ్యాణదుర్గం, మార్చి31 (జనస్వరం) : కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలంలో బుడిమేపల్లి, గుడిపల్లి, కన్నేపల్లి, ముద్దలాపురం గ్రామాల్లో జనసేన+టిడిపి+బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ చౌదరి మరియు కుటుంబ సభ్యులతో కలిసి జనసేన+టిడిపి ఉమ్మడిగా ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇంచార్జ్ బాల్యం రాజేష్ & బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు అంజినేయులు సూచనలతో బుడిమేపల్లి జనసేన నాయకులు K.T.తిమ్మరాజు, కాలువ ధనంజయ, అనిల్, రాజన్న, గుడిపల్లి జనసేన నాయకులు ఈరన్న, విజయ్, కన్నేపల్లి జనసేన నాయకులు రాజేష్, ముద్దలాపురం జనసేన నాయకులు రామంజి మరియు జనసైనికులు జనసేన పార్టీ తరఫున పాల్గొన్నారు.