
నెల్లిమర్ల ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు లోకం మాధవి గారు జగన్ రెడ్డి గారి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కారణం గా నియోజకవర్గంలోని నాలుగు మండలాలకి చెందిన జనసేన నాయకులు మరియు వీరామహిళలకు ఇబ్బందులకు గురి చేస్తూ అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని తెలియజేసారు.జనసైనికులు జనసేన నాయకులు వీరామహిళలు ఎప్పుడు ప్రజల తరపున పోరాడతారు అని తెలిపారు. ఎయిర్పోర్ట్ భూసేకరణ లో ఎన్ని అవకతవకలు అయ్యాయో, ఎన్ని కోట్లు అధికర పార్టీ నాయకులు మింగేసారో ప్రజలకి తెలుసు అని, పునరావాస కాలనీలలో కనీస సదుపాయాలు లేకుండా, ప్యాకేజీలు కూడా సరిగ్గా అందలేదు అని అక్కడ ఎంతో మంది ప్రజలు తమకి మోరపెట్టుకున్నప్పుడు వారి తరపున పోరాడి వారికి అండగా నిలిచినందుకే ఈ రోజు అరెస్టుల పర్వానికి వైస్సార్సీపీ ప్రభుత్వం తెరలేపింది అని మాధవి గారు తెలిపారు. శంకుస్థాపనకి ప్రజలు స్వచ్ఛందంగా రావాలి కానీ బలవంతంగా ఉపాధి హామీ పథకం చేసే వారిని అక్కడికి తరలించడం దారుణమని మాధవి గారు ధ్వజమెత్తారు. ఈ శంకుస్థాపనకి కొన్ని కోట్ల ప్రజాధనం ఖర్చు పెడుతున్నారని హంగులు ఆర్భాటాలకి మాత్రమే అన్నట్టు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తయారైందని లోకం మాధవి గారు తెలిపారు.