నెల్లిమర్ల ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజకవర్గం లో పలు గ్రామాలలో జనసేన పార్టీ ఇంచార్జి లోకం మాధవి గారు తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని పరామర్శించడం జరిగింది. తుఫాను తీరం దాటిన తర్వాత విపరీతంగా వీచిన గాలుల వల్ల వరి పనలు నేల వాలయని, నీటి మునిగిన వరిని అన్నదాత కష్టాలను స్వయంగా చూసిన మాధవి చలించిపోయారు. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఏకధాటిగా కురిసిన వర్షం కారణంగా ఎక్కువ శాతం వరి పైరు కి ఎక్కువ నష్టం కలిగిందన్నారు అనేక ప్రాంతాలలో పంటలకు ముంపునకు గురయ్యాయి. కోతకోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం తీసేందుకు రైతులకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసి చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లోకం మాధవి గారు మాట్లాడుతూ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని రైతులుకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున నుంచి డిమాండ్ చేశారు.