నెల్లిమర్ల ( జనస్వరం ) : పూసపాటిరేగ మండలం చింతపల్లి, పంచాయతీలో జనసేన నాయకురాలు లోకం మాధవి గారు చనిపోయిన ముత్స్యకారుల కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న మత్స్యకార గ్రామలు చాలా దుర్భర పరిస్థితితుల్లో ఈ రోజు ఉన్నాయి అని, ఈ పరిస్థితులకి కారణం ప్రభుత్వాల వైఫల్యమే అని ఎలక్షన్లకి ముందు ముత్స్యకారు ఓట్ల కోసం జపం చేసి అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. గత కొన్నాళ్ళుగా నెల్లిమర్ల నియోజకవర్గం లోని ముత్స్యకార గ్రామాల ప్రజలు వారి కుటుంబాలని విడిచిపెట్టి వారి జీవనాదికోసం ఎంతో దూరం వలసలు వెళ్ళవల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దాని వలనే ఈ రోజు చింతపల్లి పంచాయతీ లో ఇద్దరు మత్స్యకారుల చావుకి కారణమైందని వారిలో ఒకరు గుజరాత్ మరొకరు కర్ణాటక లో ప్రాణాలు విడిచిపెట్టడం ఎంతో విచారకరంగా ఉందని తెలిపారు. ఇన్ని వలసలు కొనసాగుతున్న ఎంతో మంది ప్రాణాలు విడిచి పెడుతున్న ప్రభుత్వం వారి గోడుని పెడచెవిన పెడుతుందని, ఉత్తరాంధ్ర నుండి ఎంతో మంది ఎన్నో ఏళ్లుగా కాబినెట్ లో మంత్రులుగా ఉన్న, ముత్స్యకార కుటుంబాల పరిస్థితిల్లో ఏ మార్పు రాలేదు. వలసలని అరికట్టాలి అంటే ఈ ప్రాంతంలో జట్టి నిర్మాణం మరియు ఫిషింగ్ హార్బర్ర్ నిర్మించి ఉపాధి అవకాశాలు కల్పించాలని అప్పుడే ఈ వలసలని అరికట్టవచ్చు అని తెలిపారు. సముద్రంలో వివిధ పరిశ్రమల నుండి వస్తున్న రాసాయనాలని నేరుగా సముద్రం లోకి వదలడం ద్వారా ముత్స్యసంపద దెబ్బ తింటోంది అని దాని వలన తమకు జీవనోపాధి కరువైంది అని ముత్స్యకారులు వాపోయారు. ఈ ప్రభుత్వాలు మత్స్యకారులని ఒక ఓటు బ్యాంకు గానే చూస్తున్నాయి అని జనసేన పార్టీ ఒక్కటే వారి పట్ల, వారి హక్కుల పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉంది అని తెలిపారు. ఉత్తరాంధ్ర నుండి మత్స్యకార మంత్రిగా ఉన్న సిదిరి అప్పలరాజు వారి సమస్యలపైన స్పందించకపోవటం జట్టినిర్మాణం పైన ఉత్తరాంధ్ర ప్రజలకి హామీ ఇవ్వకపోవడం ఎంతో సిగ్గుచేటు అని తెలిపారు. చనిపోయిన ముత్స్యకారుల కుటుంబానికి ఆర్ధికసహాయం అందజేసి వారికి అండగా ఉంటాం అని లోకం మాధవి గారు భరోసా కల్పించారు. అదే పంచాయతీలో ఇల్లు దగ్ధం అయిన కుటుంబాన్ని మాధవి లోకం గారు పరామర్శించారు, వారి కుటుంబానికి ఆర్ధికసహాయం చేసి వారికి అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు. మాధవి గారు మాట్లాడుతూ పూరిగుడిసెలు దగ్ధం అవ్వడం నియోజకవర్గం లో సాధారణంగా మారిపోయింది అని వారిని కనీసం పలకరించటానికి వారి ఆస్థి నష్టం తెలుసుకోవటానికి ఏ ప్రభుత్వ అధికారి ఇప్పటివరకు వీరి దగ్గరకి వచ్చిన దాఖలాలు లేవని, వారికి ప్రభుత్వం వారు పక్క ఇల్లు ఇప్పటివరకు నిర్మించకపోవడం చాలా బాధకరం అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com