నెల్లిమర్ల ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి గారి ఆధ్వర్యంలో భోగాపురం మండలంలోని గుడివాడ పంచాయతీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా గుడివాడ పంచాయతీకి చెందిన ఎంతోమంది పురుషులు మరియు మహిళలు ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుడివాడ పంచాయతీకి చెందిన మహిళలు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని, మాధవి గారికి ధన్యవాదములు తెలిపారు. లోకం మాధవి గారు మాట్లాడుతూ గుడివాడ పంచాయతీ లో ఎంతో మంది ప్రజలు, కాన్సర్ తో బాధపడుతున్నారు అని అలాగే డయాబెటిస్ మరియు షుగర్ వ్యాధిస్తులు ఎంతోమంది ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా కంటి చూపుతో బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారని, వారందరికీ మరోసారి కంటి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి వారికి తగిన చర్యలు తీసుకుంటామని గుడివాడ పంచాయతీ ప్రజలకు తెలియజేశారు. గ్రామ ప్రజలు చెబుతున్నట్టుగా గుడివాడ పంచాయతీ యొక్క పారిశుద్ధ్యం ఎంతో దయనియస్థితిలో ఉందని అలాగే చెత్త ప్రతి వీధిలో పేరుకొని పోయి ఉందని ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల ఆరోగ్యం మీద ప్రస్తుత ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని లోకం మాధవి గారు వండిపడ్డారు. జనసేన ప్రభుత్వం వచ్చాక ప్రజల ఆరోగ్యమే ముఖ్య ధ్యేయంగా ముందుకు వెళతామని లోకం మాధవి గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భోగాపురం మండలం నాయకులు పల్లా రాంబాబు, గుడివాడ పంచాయితీ నాయకుడు దాలినాయుడు జన సైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com