Logo
Date of Publish : 29 March 2023, 3:35 pm
Editor : Sake Naresh

మత్స్యకారులకి వెంటనే పక్కా గృహాలు కట్టించాలని డిమాండ్ చేసిన లోకం మాధవి

    నెల్లిమర్ల ( జనస్వరం ) : భోగాపురం మండలంలోని ముక్కాం గ్రామంలో  అగ్ని ప్రమాదం సంభవించింది. ముక్కాంలో అధికంగా మత్స్యకార కుటుంబాలు నివసిస్తుంటారు. వీరిలో ఎక్కువ మందికి పూరి గుడిసెలు ఉండటం గవనార్హం, ఉదయం ఓ పూరి గుడిసె తగలబడుతుండటం చూసిన జనసైనికులు వెంటనే స్పందించి ఆ మంటలను ఆర్పడం జరిగింది. దీనిలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నెల్లిమర్ల నియోజకవర్గ నాయకురాలు లోకం మాధవి గారు ఆ ప్రదేశానికి విచ్చేసి బాధితులని పరామర్శించారు. లోకం మాధవి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 2019 ఎలక్షన్ల నాడు మత్స్యకార కుటుంబాలకి పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే తుంగలోకి తొక్కేసారని మండిపడ్డారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో ఎన్నో అగ్నిప్రమాదాలు సంభవించాయని, వాటిని నిర్మూలించేలా నియోజకవర్గ నాయకులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కనీసం అగ్నిమాపక సిబ్బంది వారు కూడా స్పందించటం లేదు అని తెలిపారు. మత్స్యకారులు ఎంతో కష్టపడి దాచిపెట్టుకున్న సొమ్ముని వారి గుడిసెల్లో పొందుపరచుకుంటే ఇలాంటి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు కష్టార్జితం మొత్తం అగ్గిపాలవటం చాలా బాధాకరమైన విషయం అని తెలియజేశారు. ఈ సమస్య పైన తమ వైపు నుండి భవిష్యత్తు కార్యచరణ ఉంటుందని ఈ అగ్ని ప్రమాదాలు నిలువరించేలా, మత్స్యకారులకి పక్కా ఇల్లు కట్టేలా తమ పోరాటం ఉంటుందని లోకం మాధవి గారు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com