నెల్లిమర్ల ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల మండలం, వల్లూరు గ్రామంలో కడప గడపకు జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకురాలు లోకం మాధవి గారు గడపగడపకు పర్యటించి ఒక మార్పు కోసం మంచి అభివృద్ధి కోసం జనసేనకు ఓటు వెయ్యాలని స్థానికులు అభ్యర్థించారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని, తమ బిడ్డల భవిష్యత్తు కోసం వారి భావితరాల కోసం ఈసారి ఆలోచించి మంచి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వల్లూరు నాయకులు టింగు రంగ, చైతన్య, జయరాజ్, ఈశ్వర్ రావు, అలాగే నెల్లిమర్ల నాయకులు కురుమజ్జి, గోవింద్, ఆల్తి రామచంద్ర, మరియు తదితర జన సైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com