ఒంగోలు ( జనస్వరం ) : సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 66వ రోజు ఒంగోలులోని 24వ డివిజన్ సమైక్య నగర్ లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు జనసేన నాయకులతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో మమ్మల్ని బాగా ప్రభావితం చేసిందని అన్నారు. బడుగు బలహీన వర్గాలను ఇప్పటివరకు అందరూ ఓటు బ్యాంకు గానే చూశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంకుగా కాకుండా వారిని కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తామని చెప్పడం మమ్మల్ని బాగా ఆకర్షించాయని అన్నారు. అలానే స్థానిక యువత కూడా మాట్లాడుతూ సరైన ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నామని తాను అధికారంలోకి వస్తే పదిమందికి ఉపాధి కల్పించేలా యువతను తయారు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం మాకు బాగా నచ్చిందని అన్నారు. అలాంటి నాయకుడి వెంట నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తమ పూర్తి మద్దతు జనసేన పార్టీకి ఉంటుందని నాయకులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు పోకల హనుమంతు రావు, ఆకుపాటి ఉష, వీర మహిళ మాదాసు సాయి నాయుడు, జనసేన నాయకులు అరవింద్ బాబు ముత్యాల, నరసింహారావు, చెన్ను నరేష్, అవినాష్ నాయుడు, నాగరాజు ఈదుపల్లి, ఉంగరాల వాసు, యాదల సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com