శ్రీకాళహస్తి ( జనస్వరం ) : రేణిగుంట మండలం, అడుసుపాలెం గ్రామంలో 50 మంది రైతుల విలువైన (ఎకరా 1 - 1.5Cr) రిజిస్ట్రేషన్ అయిన 40 ఎకరాల భూములను రెవెన్యూ అధికారుల సహకారంతో స్థానిక ఎమ్మెల్యే కబ్జా ప్రయత్నం చేస్తున్నారని నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వినుత కోటా అన్నారు. రైతులు న్యాయం కోసం జనసేనను ఆశ్రయించారని ఆమె అన్నారు. గ్రామానికి వెళ్లి పరిశీలించి అనంతరం శ్రీకాళహస్తి ఆర్డీఓ గారిని రైతులతో కలిసి వెళ్ళి రైతుల సమస్యలను తెలియజేయడం జరిగిందని ఆమె తెలిపారు. గ్రామంలో ఎంక్వైరీ చేసి రైతుల భూములను ఆన్లైన్లో దరఖాస్తు చేసి, న్యాయం చేయాలని కోరడం జరిగింది. రైతులకు న్యాయం జరగని పక్షాన జనసేన పార్టీ రైతులతో కలిసి పోరాడుతామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు రవి కుమార్ రెడ్డి, సురేష్, గిరీష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com