గొల్లప్రోలు ( జనస్వరం ) : వైసిపి నాయకులు, జగనన్న ప్రభుత్వం భయపెట్టి స్థలం లేకుండా అని చెప్పి బలవంతంగా ఎంత వరకు నివాసయోగ్యంలేని స్థలాల్లో ఇల్లు కట్టించాలని వర్షం పడితే స్థానికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి విమర్శలు గుప్పించారు. జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా సోమవారం గొల్లప్రోలు మండలంలో ఆమె పర్యటించి స్థానికంగా 2500 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చిన ప్రదేశాన్ని ఆమె పరిశీలించి స్థానిక లబ్ధిదారులతో, ప్రస్తుత కాలంలో ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారితో ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు చెప్పిన వివరాలు ప్రకారం.. నివాసం లేని వారికి కాకుండా అనర్హులకు, ఇల్లు ఉన్నవారికి, ప్రభుత్వ సానుకూలపరులకు పట్టాలు ఇచ్చారని స్థానికులు వివరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఊరికి పది కిలోమీటర్ల దూరంలో స్ధలాలు ఉన్నాయని అలాంటి స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి భయంకర పాములతో, ఇతర విషాజీవాలతో ఉన్నాయన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకొని ఇచ్చిన స్థలాలకు కనీస అవసరాలు అయినా రోడ్డు, తాగునీరు, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల అధ్యక్షుడులు అమరాది వల్లి, పట్టా శివ,గోపు సురేష్, గున్న బత్తుల రాంబాబు,మేళం బాబీ, యాండ్రపు శ్రీనివాస్, వినుకొండ అమ్మాజీ, కంద సోమరాజు, పబ్బిరెడ్డి ప్రసాద్, ఇజ్రాయిల్,సురేంద్ర, దుర్గాప్రసాద్,మరియు జన సైనికులు, వీర మహిళలు,తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com