Logo
Date of Publish : 24 June 2021, 4:48 pm
Editor : Sake Naresh

దేవరదిబ్బకు తాగునీరు అందించాలని స్థానిక జనసేన నాయకుల డిమాండ్

          పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల పరిధిలోని దేవరదిబ్బ గ్రామంలో 200కు పైగా గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న భూముల్లో స్థానిక పవర్ ప్లాంట్ యాజమాన్యం యాష్ పాండ్ నిర్మించింది. అప్పట్లో బూడిద వల్ల సమస్యలు తెలెత్తకుండా వేరే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని దెవరదిబ్బ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఇళ్ల సంగతి అటుంచితే పవర్ ప్లాంట్ విడుదల చేసే బూడిదతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం వారికి తాగునీరు కూడా అందుబాటులో లేని పరిస్థితి. స్థానిక జనసేన నాయకులు శ్రీ బొబ్బేపల్లి సురేష్ బాబు పర్యటన సందర్భంగా గ్రామస్థులు తమ సమస్యలను వెళ్లబోసుకున్నారు. అధికార పార్టీ మద్దతుతో గెలుపొందిన గ్రామ సర్పంచ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా వారి నుంచి స్పందన కరువయ్యింది. దీంతో తక్షణం వారికి ట్యాంకర్లతో మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేయడంతో పాటు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తామని శ్రీ సురేష్ బాబు హామీ ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com