Logo
Date of Publish : 14 July 2021, 11:30 am
Editor : Sake Naresh

కుప్పంలోని ప్రధాన సమస్యలను జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లిన స్థానిక జనసేన నాయకులు

              ఇటీవల జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా డా. పసుపులేటి హరిప్రసాద్ గారిని నియమించిన సంగతి తెలిసిందే. కుప్పం జనసేన నాయకులు Dr.ముదినేని వెంకట రమణ గారు, రామకుప్పం మండలం జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్ గారిని సత్కరిస్తూ వారి దృష్టికి నియోజకవర్గ ప్రధాన సమస్యలను తీసుకెళ్లారు. జనసేన నాయకులు మాట్లాడుతూ (హంద్రీనీవా) సుజల స్రవంతి కాలువ ఇంకా కుప్పం నియోజకవర్గానికి నీటిని ఇవ్వలేదు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనులు కొంత వరకు చేసిన పుంగనూరు వరకు నీటిని వాళ్ళు కల్పిచడం జరిగింది అని చెప్పారు. కానీ మా కుప్పంకు నీటిని వాళ్ళు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్పటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటన చేసి ఎన్నికల హామీల్లో కుప్పంలో ఉన్న హంద్రీనీవా నీటి కాలువని పూర్తి చేస్తా అని చెప్పారు. కానీఇప్పటి వరకు దాని పనులు గురించి ఆలోచన కూడా చేయలేదు.  కుప్పం పాలరు ప్రాజెక్టును గత ముఖ్యమంత్రి దివంగత dr. రాజశేఖర్ రెడ్డి గారు పాలరు ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. అది ఇప్పటికి పనులు జరగలేదు. దాని తరువాత వచ్చిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కుప్పం, గుడుపల్లి ఈ రెండు మండలాలలో జరుగుతున్న రాళ్ల మైనింగ్ ఎక్కువగా జరుగుతుందని, ఎలాంటి అనుమతి లేకుడా అక్రమంగా క్వారీ పనులు జరుగుతుందన్నారు. అధికార పార్టీ అండతో పనులు జరుగుతున్నాయని అన్నారు. గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఎక్కువ అవినీతి అక్రమాలలు పనులు జరుగుతున్నాయని అన్నారు. పనులు చేయకుండానే బిల్లులు పెట్టి అక్రమంగా తింటున్నారు. అలాగే ప్రజలతో చేయకుండా యంత్రాలలో పనులు చేస్తున్నారు. వాటి గురించి అడిగితే వారిపై దాడులు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు. పసుపులేటి హరిప్రసాద్ గారు స్పందిస్తూ త్వరలోనే వీటిపై నియోజకవర్గంలో ఒక కార్యచారణ రూపొందించి సమస్యలపై పోరాడుదామని ఉత్సాహాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com