విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉపాధి హామీ పథకం చేసుకున్నటువంటి కూలీలు అందరూ జనసేన నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. గడిచిన పది వారాలుగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు మేం పని చేస్తున్న తాలూకా డబ్బులు అందడం లేదని ప్రత్యక్షంగా మీరే వచ్చి మేం పని చేస్తున్నటువంటి చెరువుల వద్దకు వచ్చి మా సమస్య ఉన్నతాధికారుల వద్దకు తీసుకు వెళ్ళండి అని ఆవేదన వ్యక్తపరిచారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లి అక్కడ చెరువులో పని చేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలను విచారించగా దాదాపుగా ముక్తకంఠంతో అందరూ ఒకటే సమాధానం చెబుతున్నారు. గడిచిన 10 వారాలుగా పని చేస్తున్నా కానీ మా కూలీ తాలూకా డబ్బులు జమ కాలేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. కరోనా కష్టకాలంలో డబ్బులు చెల్లించకపోతే పేదల కడుపు ఏ విధంగా నింపుకుంటారు. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వి ఆర్ పి లను మా డబ్బులు పడలేదు అని అడిగితే వస్తాయని చెబుతున్నారే గాని, ఏ రోజు వస్తాయని సమాధానం చెప్పట్లేదని అన్నారు. కొంతమంది వి ఆర్ పి లు మరియు టెక్నికల్ అసిస్టెంట్లు వద్ద ప్రస్తావించిన వారు సమాధానం దాటవేసిన పరిస్థితి తక్షణమే స్పందించి ఏ పీ ఓ గారు మరియు డ్వామా పిడి ఈ సమస్యను పరిష్కరించకపోతే ఉపాధి హామీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున జనసేన పార్టీ తరఫున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని హెచ్చరి౦చారు. ఉపాధి హామీ తాలూకా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన అటువంటి ఉన్నతాధికారులు సంబంధిత విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన తరపున విజ్ఞాపన చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు VOODI చక్రవర్తి. సూరవరపు శ్రీను, లంక వీర పాత్రుడు తదితరులు పాల్గొన్నారు.