ఇటీవల జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా డా. పసుపులేటి హరిప్రసాద్ గారిని నియమించిన సంగతి తెలిసిందే. కుప్పం జనసేన నాయకులు Dr.ముదినేని వెంకట రమణ గారు, రామకుప్పం మండలం జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్ గారిని సత్కరిస్తూ వారి దృష్టికి నియోజకవర్గ ప్రధాన సమస్యలను తీసుకెళ్లారు. జనసేన నాయకులు మాట్లాడుతూ (హంద్రీనీవా) సుజల స్రవంతి కాలువ ఇంకా కుప్పం నియోజకవర్గానికి నీటిని ఇవ్వలేదు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనులు కొంత వరకు చేసిన పుంగనూరు వరకు నీటిని వాళ్ళు కల్పిచడం జరిగింది అని చెప్పారు. కానీ మా కుప్పంకు నీటిని వాళ్ళు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్పటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటన చేసి ఎన్నికల హామీల్లో కుప్పంలో ఉన్న హంద్రీనీవా నీటి కాలువని పూర్తి చేస్తా అని చెప్పారు. కానీఇప్పటి వరకు దాని పనులు గురించి ఆలోచన కూడా చేయలేదు. కుప్పం పాలరు ప్రాజెక్టును గత ముఖ్యమంత్రి దివంగత dr. రాజశేఖర్ రెడ్డి గారు పాలరు ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. అది ఇప్పటికి పనులు జరగలేదు. దాని తరువాత వచ్చిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కుప్పం, గుడుపల్లి ఈ రెండు మండలాలలో జరుగుతున్న రాళ్ల మైనింగ్ ఎక్కువగా జరుగుతుందని, ఎలాంటి అనుమతి లేకుడా అక్రమంగా క్వారీ పనులు జరుగుతుందన్నారు. అధికార పార్టీ అండతో పనులు జరుగుతున్నాయని అన్నారు. గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఎక్కువ అవినీతి అక్రమాలలు పనులు జరుగుతున్నాయని అన్నారు. పనులు చేయకుండానే బిల్లులు పెట్టి అక్రమంగా తింటున్నారు. అలాగే ప్రజలతో చేయకుండా యంత్రాలలో పనులు చేస్తున్నారు. వాటి గురించి అడిగితే వారిపై దాడులు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు. పసుపులేటి హరిప్రసాద్ గారు స్పందిస్తూ త్వరలోనే వీటిపై నియోజకవర్గంలో ఒక కార్యచారణ రూపొందించి సమస్యలపై పోరాడుదామని ఉత్సాహాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.