
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కన్నెవలస , చుట్టుగుండంగ్రామానికి వెళ్ళే దారిలో NH16 కి 30మీటర్ల దూరంలో గల వంశధార కాలువ వంతెన ప్రమాదానికి గురై 24ఏళ్లవుతున్న ఇంకా దీనిపై గ్రామ సర్పంచ్ నుంచి MLA స్థాయి వ్యక్తి వరకు ఎవరు పట్టించుకోవడంలేదు. పలుమార్లు స్థానిక ఉన్నాతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వంశధార కాలువ మరింత దెబ్బతిన్నదని, వర్షాలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని స్థానిక జనసేన నాయకులు వారించినా లాభం లేదని చెప్తున్నారు. టెక్కలి జనసేన ఇంఛార్జ్ కణితి కిరణ్ ఈ పరిస్థితిని తెలుసుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించి, స్థానిక అధికారులకు తెలియజేశారు. వీలయినంత త్వరలో పనులు ప్రారంభించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. రానున్న స్పందన కార్యక్రమంలో ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని పై అధికారులకు తెలియజేస్తామని స్థానిక ప్రభుత్వ అధికారులు టెక్కలి జనసేన ఇంఛార్జ్ కణితి కిరణ్ కు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఇంచార్జి కణితి కిరణ్, మండల నాయకులు ఫణి కుమార్, కోటి తదితురులు పాల్గొన్నారు.