తెనాలి కోవిడ్ ఆసుపత్రి స్టాఫ్ నర్సులకు కోవిడ్ కిట్లను అందించిన స్థానిక మరియు వర్జినీయా జనసైనికులు.
తెనాలి కోవిడ్ ఆసుపత్రిలో నర్సుల ఆందోళనకి స్పందించిన జనసైనికులు... శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు స్థానిక జనసేన శ్రేణులు, ఎన్.ఆర్.ఐ విభాగం తరఫున 80 మంది నర్సింగ్ స్టాఫ్ కి ఒక్కొక్కరికీ లీటరు చొప్పున బ్రాండెడ్ శానిటైజర్, హెడ్ షీల్డులు, సర్జికల్ మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు అందచేత. ఈ కార్యక్రమములో స్థానిక జనసేన పార్టీకి చెందిన శ్రీ జీడుగు తులసీరాం, శ్రీ ఆదినారాయణ, శ్రీ పి.మురళీకృష్ణ, శ్రీ రవికాంత్, శ్రీ రమాకాంత్ గార్లు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్.ఆర్.ఐ వర్జినీయా విభాగానికి చెందిన శ్రీ వెంకట్ గారు సహకారం అందచేశారు.