విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇండస్ట్రియల్ బెల్ట్ మల్కాపురంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వైన్ షాప్ దగ్గర ప్రజలు భారీగా గుమిగూడి కనిపించారు. మద్యం షాపు దగ్గర రానీ కరోనా మాంసం దుకాణాల దగ్గరికి వస్తుందా ? అని జనసేన నాయకులు ధర్మేంధ్ర ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తాం అన్నారు. ఈ రెండేళ్ళు మాట తప్పుతూ మడం తిప్పుతూ వచ్చారు. ఈ కరోనా సమయంలో అయినా మద్యం షాపులు మూసి కరోనా వ్యాప్తిని అరికట్టాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు వేలాదిగా పెరుతున్నాయని అందుకు ఒక రకమైన కారణం ఈ మద్యం షాపులేనని అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మద్యం షాపులు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం కేవలం మద్య౦ మీద ఆధారపడటం దౌర్భాగ్యమని, రాష్ట్రంలో ఇంతవరకూ ఒక పరిశ్రమ తెచ్చి నిరుద్యోగులకు ఒక ఉద్యోగం కూడా ఇచ్చినా పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 62 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ప్రకాష్ గారు మరియు జనసేన శ్రేణులు నగేష్, సంతోష్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేవుడిచ్చిన వరం! జనసేన నాయకులు బండారు శ్రీనివాస్
అంబులెన్స్ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here