Logo
Date of Publish : 01 December 2020, 2:44 pm
Editor : Sake Naresh

జన నివాసాల మధ్య మద్యం షాపును తొలగించాలి : జనసేన నాయకులు

జన నివాసాల మధ్య మద్యం షాపును తొలగించాలి : జనసేన నాయకులు

           విజయనగరం, 42వ డివిజన్, కామాక్షినగర్ లో సుప్రియ రెస్టారెంట్&బార్ ను గృహానివాసాల మధ్య ఉన్న మద్యం దుకాణం తొలగింపులో అధికారుల నిర్లక్ష్యంపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేనపార్టీ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో బాలు మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యనిషేధాన్ని అమలుచేస్తామని చెప్పి అధికారం దక్కిన తరువాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఏవేవో పేరు తెలియని మద్యంను దించి పేదల రక్తమాంసాలను తింటుందని ఆరోపించారు.  ఈ మధ్యనే అధికారులు జననివాసాల మధ్య కామాక్షి నగర్లో బార్ ను పెట్టడానికి లైసెన్స్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలక్టర్, జిల్లా సూపరెండేంట్ ఆఫ్ పోలీసు, జిల్లా మద్యపాన నియంత్రణ సూపరిడెంట్ గ్రీవిన్స్ లో వినతిపత్రాల్ని ఇచ్చామని అన్నారు. ఇంత వరకు అధికారులు ఈ విషయమై చలించలేదని, అధికారులనిర్లక్ష్యంపై నిరసనగా నిరసన దీక్షను చేబట్టామని, ఇకనైనా అధికారుల్లో చలనం రాకపోతే స్థానికులను అందరినీ కదిలించి, కలసివచ్చిన రాజకీయ పార్టీలతోను, ప్రజాసంఘాలతోను పెద్ద యెత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జనసేన ఝాన్సీ వీరమహిళ తుమ్మి లాక్ష్మీరాజ్ గారు మాట్లాడుతూ కామాక్షి నగర్ లో జననివాసాలమధ్య మద్యంషాపు పెట్టడటంతో తాగుబోతుల ఆగడాలు మొదలయ్యాయని, స్థానిక మహిళలు, ప్రజలు భయాందోళనలో ఉన్నారని తొందరలోనే అధికారులు ఈ సుప్రియ బార్ ను కామాక్షి నగర్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఝాన్సీ వీరమహిళలు ఈశ్వరమ్మ గారు, ముదిలి సర్వమంగల గారు, త్యాడ కనక మహాలక్ష్మి, జనసేన నాయకులు లోపింటి కళ్యాణ్, ఏంటి రాజేష్, భాస్కరరావు, శివకుమార్ గారు, కారి రాజేష్ బాబు, రామకృష్ణ గారు, నలమరాజు, కుమార్, స్థానిక మహిళలు, ప్రజలు తదితరులు హాజరయ్యారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com