పొదుపు సంఘాలకు రుణాల మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వెలుగు సిబ్బంది – ఎమ్మిగనూరు జనసేన పార్టీ నాయకులు
జనసేన పార్టీ నాయకులు బి సి నాగరాజు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఇక్కడి డి అర్ డి ఏ – వెలుగు అధికారులు, సిబ్బంది కరోనా వైరస్ సాకుతో సకాలంలో స్పందించకపోగా, దినసరి కార్యక్రమలను కూడా సక్రమంగా నిర్వహించడం లేదని, వీరిపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, బ్యాంకు లింకేజ్ రుణాలు, శ్రీ నిధి రుణాలు, సబ్సిడీ స్వయం సహాయక రుణాలు తదితర రుణాలు మంజూరు కోసం పొదుపు సంఘాల మహిళలు రోజుల తరబడి వెలుగు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా నిర్లక్ష్యం, జాప్యం చేస్తున్నారని, ఇక్కడ లాక్ డౌన్ కంటే ముందే ప్రతి గ్రామ పంచాయతీ పొదుపు ఐక్య సంఘాలకు శ్రీ నిధి రుణాలు మంజూరు చేయాలని సంబంధిత వెలుగు శాఖకు నిధుల కేటాయిస్తే, గడచిన ఐదు నెలలుగా సగం పొదుపు సంఘాలకు కూడా మంజూరు చేయలేదని, కానీ లాక్ డౌన్ విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న పొదుపు సంఘాల మహిళలకు గతంలో బ్యాంకు లింకేజ్ ద్వారా, స్వయం సహాయక సంఘాల ద్వారా ఇచ్చిన రుణాలను రికవరీ చేయడంలో మాత్రం అత్యుత్సాహం చూపుతున్నారని పేర్కొన్నారు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మారిటోరియం సూచనల మేరకు పొదుపు సంఘాల మహిళలకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కలగట్ల రాజు, పరమేష్, నర్సింహులు పాల్గొన్నారు.