పెదపాడు, జూన్ 1 (జన స్వరం)
స్థానిక శాఖా గ్రంథాలయంలో సోమవారం జరిగిన వేసవి శిబిరంలో విద్యార్థులకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం గురించి చెప్పారు.రిసోర్స్ పర్సన్ పూడి రవికుమార్ మాట్లాడుతూ "ఆజాద్ దేశ తొలి విద్యాశాఖ మంత్రి. ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుతాం. యూజీసీ, ఏఐసీటీఈ స్థాపించారు. 1992లో భారతరత్న వచ్చింది" అని వివరించారు.అనంతరం రిసోర్స్ పర్సన్ గుంటూరు శ్రీనివాసరావు 'ఉపాయం' పుస్తకం నుంచి కథలు చదివించారు. విద్యార్థులకు క్రికెట్ నేర్పించి ఆడించారు.గ్రంథాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్నాక్స్ పంపిణీ చేశారు.